ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ.. కథ అడ్డం తిరిగింది. ఏమైందో ఏమో గానీ, ఆమెకు వేరొకనితో పెళ్లైంది. ప్రియుడు తట్టుకోలేకపోయాడు ఏంచేయాలని అలోచించాడు ప్రియురాలి రాకకోసం ఎదురు చూసాడు. ఆసమయం రానే వచ్చింది చివరకు ఆమె పుట్టింటికి రావడంతో.. మళ్లీ ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో.. ప్లాన్ వేసుకున్న ప్రకారం ఆమెను కిడ్నాప్ చేశాడు. ఓరూమ్ లో తీసుకెళ్లి బంధించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ఏమీ తెలియనట్లు బాధితురాలిని ఇంటి వద్ద దింపి వెళ్లిపోయాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులను చెప్పడంతో.. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. దీంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడేనికి చెందిన యువతికి లక్కవరం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వివాహమై నెల రోజులు మాత్రమే అవుతోంది. యువతి తన భర్తతో కలిసి ఆగస్టు 6 న పుట్టింటికి వెళ్లింది. దీంతో.. అక్కడ శివ కుమార్ తో యువతికి ముందే పరిచయం ఉంది. అయితే.. పెళ్లయ్యాక పుట్టింటికి వెళ్లిన యువతిని చూసిన శివకుమార్ ఆమె వద్దకు ప్రేమిస్తున్నానని.. నువ్వు లేకపోతే చనిపోతానని బెదిరించాడు. యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పిటకీ అతను ఒప్పుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన శివ కుమార్ మరో యువకుడి సహాయంతో యువతిని బలవంతంగా కారులో ఎక్కించి, జంగారెడ్డిగూడెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించడమే కాకుండా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, బాధితురాలిని తీవ్రంగా కొట్టాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లిపోయాడు. ఈనేపథ్యంలో..యువతి ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబసభ్యులు విషయం ఆరా తీశారు. బాధితురాలు చెప్పింది విని నిర్ఘాంతపోయిన బంధువులు, వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు.
Star Bucks: స్టార్ బక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్