Tummala Nageswara Rao: నాలుగు సంత్సరాలలో విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల విసృత పర్యటిస్తున్నారు. మామిళ్ళగుడెం లో వెంకట కృష్ణ అపార్ట్ మెంట్ లో జరిగిన ఆత్మీయ పలకరింపు లో తుమ్మల మాట్లాడుతూ.. ఈ నాలుగు సంత్సరాలలో విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేరే చోట పోటీ చేయాల్సిన అవసరం ఉన్న.. ఇక్కడ అదిరిచ్చి బెదిరించి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు.. అందుకే ఇక్కడి నుండి చేస్తున్నానని తుమ్మల స్పష్టం చేశారు. ఇలాంటి కథలు నలబై సంత్సరాల క్రితమే చూసినా అని తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి తోటి అందరూ అభిమానించేలా నలభై సంత్సరాలు రాజకీయాలు చేసినానని అన్నారు. ఇలాంటి కుండాకొరు రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా వాళ్ళ మాట విని మనికి మాలిన అధికారులు ఎవరైనా పనిచేస్తే వాళ్ళ తాట తిస్తా అని హెచ్చరించారు.
ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు వచ్చానని, మీ పిల్లలు విదేశాల్లో ఉంటే ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండాలనేదే నా కోరిక అన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు భయంతో గడుపుతున్నారని తెలిపారు. దేశం గర్వించేలా చేసిన నందమూరి తారక రామారావు లాంటి మహానేత ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామారావు, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన అవకాశాన్ని జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావుకు 200 కుటుంబాలు మద్దతుగా నిలిచాయి.