Tummala: బీఆర్ఎస్ అరాచకాలు చక్ర వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం సమన్వయ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఇంత రసవత్తర పోటీ ఇంత కసి పట్టుదల ఉన్న ఎన్నికలు చూడలేదన్నారు. రాష్ట్రం అంతా ఓ పక్క ఖమ్మం జిల్లా ఓ పక్క అని తెలిపారు. పొరుగు రాష్ట్రం భీమవరం లో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారని అన్నారు. పందాలు మంచి సంస్కృతి కాదన్నారు. ఖమ్మం పాలేరు పై వందల కోట్లు కుమ్మరించి నాయకులను అధికార పార్టీ కొనుగోళ్లు చేస్తోందని మండిపడ్డారు. తనని, పొంగులేటి నీ ఓడించాలని అధికార యంత్రాంగం అంతా వాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వందల కోట్లకు పైగా భీమవరం లో పందాలు కడుతున్నారంటే మీ పాలన పనై పోయిందన్నారు. మీ అరాచకాలు చక్ర వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. మణులు మాణిక్యాలు అడగలే ఖమ్మం జిల్లా ఆత్మ గౌరవం ముఖ్యమన్నారు.
ఖమ్మం పౌరుషాల గడ్డ… నలబై ఏళ్ల రాజకీయ జీవితం మీ పరువు ప్రతిష్ట కోసం పనిచేసామన్నారు. మత విద్వేషాలు లేకుండా భారత్ జోడో యాత్రతో దేశం ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వం కు మద్దతుగా నిలవాలన్నారు. నాకు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్యవాదాలన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం కోసం నాడు టీడీపి నుంచి టీఅర్ఎస్ పార్టీలో చేరా అని అన్నారు. టీఅర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఒడిపోవడం ఎందుకో వర్కింగ్ ప్రెసిడెంట్ నీ అడుగు అన్నారు. చారిత్రకమైన ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగారాలని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో అరాచక అవినీతి అక్రమ కేసులు లేకుండా ప్రశాంత ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు నిచ్చారు.
Rajahmundry: గోదావరిలో కార్తీక స్నానాలు.. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు