Tsrtc-announced-10-percent-discount-on-advance-booking: సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త అందించింది. పండుగ సందర్బంగా.. ట్రావెల్ చార్జీలు విపరీతంగా పెరిగి.. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నేపథ్యంలో.. వాటన్నింటిని అడ్డుకట్ట వేసేందుకు పెట్టుకుని ప్రయాణికులను లెక్కించేందుకు ఆర్టీసీ బస్సు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు బంపర్ బొనాంజా ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారికి అడ్వాన్స్‌డ్ టికెట్ల రిజర్వేషన్ సదుపాయం కల్పించింది.
Read also: BL Santosh: హైదరాబాద్ కు బీఎల్ సంతోష్.. సర్వత్రా ఆసక్తి..
అయితే తమ సొంతూర్లకు వెళ్లడం కోసం టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడే.. తిరుగు ప్రయాణం కూడా బుక్ చేసుకుంటే..ఆ టికెట్‌పై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాకుండా.. ఒకటి రెండు రోజులు కాదండోయ్.. ఈ ఆఫర్ జనవరి 31వ తేదీ వరకు వర్తించనుందని తెలిపింది. ఈ ఆఫర్ డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో కల్పించారు. ఇక, ప్రయాణికుల రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకొని, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయితే.. తదితర వివరాల కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.
Astrology: డిసెంబర్ 27, మంగళవారం దినఫలాలు