Jobs Notification: మరో నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ..

Tspsc

Tspsc

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది.. ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగా.. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యారు.. నిరుద్యోగులు.. ఎలాగైనా ఈ సారి జాబ్‌ కొట్టాలన్న ఉత్సాహంతో ప్రీపేర్‌ అవుతున్నారు.. కోచింగ్‌ సెంటర్ల చుట్టూ పరుగులు పెడుతున్నారు.. అయితే, ఇవాళ మరో నోటిఫికేషన్‌ వచ్చేసింది… మున్సిపల్‌ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్‌ చేసింది టీఎస్‌పీఎస్సీ… మొత్తంగా 175 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది… సంబంధిత పోస్టుల కోసం.. ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల (అక్టోబర్‌) 13వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. అర్హతలు కలిగిన అభ్యర్థులు.. www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దారఖాస్తు చేసుకోవచ్చని తన ప్రకటనలో పేర్కొంది టీఎస్‌పీఎస్సీ… ఆ పోస్టులకు సంబంధించిన అర్హతలు, పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు తెలిపింది.

Read Also: Electric Bike Catches Fire: ఆగని ఎలక్ట్రిక్‌ బైక్‌ల ప్రమాదాలు.. సామర్లకోటలో బ్యాటరీ బైక్ దగ్ధం..