Site icon NTV Telugu

Group-1 Exam: విజయవంతంగా TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్‌..

Tspsc Group I Prelims

Tspsc Group I Prelims

Group-1 Prelims Exam Successfully: రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 సర్వీసుల ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రెండు నెలల్లోపు ఫలితాలను ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,86,051 మంది అంటే 75 శాతం మంది రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,019 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 150 నిమిషాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అభ్యర్థులు చాలా ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 10.15 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించబోమని TSPSC సూచించినప్పటికీ, కొంతమంది అభ్యర్థులు సకాలంలో చేరుకోలేక పోయారని.. నిర్ణీత సమయానికి చేరుకోలేని వారికి ప్రవేశం నిరాకరించబడిందని ఓ నివేదిక తెలిపింది.

ఎనిమిది పనిదినాల్లో OMR షీట్లను స్కానింగ్ పూర్తి చేస్తుందని, ఆ తర్వాత అవి www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో హోస్ట్ చేయబడతాయని కమిషన్ పేర్కొంది. ప్రిలిమినరీ కీ విడుదల చేయబడతాయి. “ప్రిలిమినరీ కీని విడుదల చేసిన తర్వాత, కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే మేము స్వీకరిస్తామని తెలిపింది. నిపుణుల కమిటీ తుది కీని నిర్ణయిస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే రెండు నెలల్లోపు ఫలితాలు వెలువడుతాయి’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Read also: Poster war in Munugode: అప్పుడు నెగిటివ్.. ఇప్పుడు పాజిటివ్.. మునుగోడులో పోస్టర్ వార్

ఇంతకుముందు, 121 మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, 42 డిప్యూటీ కలెక్టర్లు, 41 మున్సిపల్ కమిషనర్ – గ్రేడ్-2 మరియు 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లతో సహా 503 గ్రూప్-1 పోస్టులను కమిషన్ నోటిఫై చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడుదలైన తొలి గ్రూప్-1 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇదే. అంతకుముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 సంవత్సరంలో మొత్తం 312 పోస్టుల కోసం పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Edible-Oil-Prices: పెరిగిన దిగుమతులు.. తగ్గుతున్న వంట నూనెల ధరలు

Exit mobile version