TSPSC Group-1: గ్రూప్-1 భర్తీకి లైన్‌క్లియర్.. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా గత ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పడిన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.
Read also: Rozgar Mela: నేడు లక్ష మందికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ
Also Read
సర్కార్ గ్రూప్-1 పోస్టులను పెంచింది..
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన 503 గ్రూప్ -1 నోటిఫికేషన్ తో పాటు మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులతో పాటు ఈ 60 పోస్టులను కలిపి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్ పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 11న టీఎస్ పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా 60 కొత్త పోస్టులు మంజూరు కావడంతో గ్రూప్-1 ప్రిలిమినరీ మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది.
Read also: Qatar-India: గూఢచర్యం ఆరోపణలు.. 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్ ప్రభుత్వం!
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండేళ్ల కిందటే తొలిసారిగా అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించారు. అనంతరం ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో కమిషన్ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది మళ్లీ జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. వారిలో 25 వేల మందిని 1:50 నిష్పత్తిలో టీఎస్‌పీఎస్సీ ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో అనూహ్యంగా కమిషన్ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్ తాజాగా దావా వేసింది. దీంతో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు లైన్ విడుదలై పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Medaram Traffic: మేడారంలో ట్రాఫిక్ కష్టాలు.. జాతర స్టార్ట్ అయితే పరిస్థితేంటి..?
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!