YS Sharmila:YSRTP అద్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై దళిత, టీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరుపెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్ షర్మిలపై SC, ST, చట్టం కింద కేసు నమోదచేయాలని దళిత నాయకులు పోలీసులకు కోరారు.
జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు, “కంత్రి” కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎక్కడ చూసినా కబ్జాలే ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు… ఒక దళితుడు అయి ఉండి చెరువులు.. అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. పండిత పుత్ర పరమ శుంఠ, నా కొడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. కాగా, ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు షర్మిల. అయితే తాను చేసిన విమర్శలు.. ఆరోపణలపైనే టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి