TS SSC Results: నేడే టెన్త్ ఫలితాలు.. సమయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను అధికారులు నేడు విడుదల చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం bse.telangana.gov.in, bseresults.telangana.gov.in విద్యార్థులు తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
గత రేండేళ్లుగా రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులకు ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులను కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి వైరస్ ప్రభావం తగ్గడంతో పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసి, కరోనా నిబంధనలతో టెన్త్ పరీక్షలను నిర్వహించారు. కాగా.. స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమవడం.. పూర్తి స్థాయిలో క్లాసులు జరగకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతోంది.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
అయితే.. తెలంగాణలో నిర్వహించిన టెన్త్ ఎగ్జామ్స్ కు సుమారు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదోతరగతి ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. కాగా.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ అధికారులు నిర్వహించారు. పాఠ్యాంశాన్ని సైతం 30 శాతానికి తగ్గించారు. పిల్లలకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ. అయితే.. ఇప్పటికే ఏపీలో టెన్త్ ఫలితాలను విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. కాగా.. కేవలం 67 శాతం మాత్రమే పాస్ పర్సంటేజ్ నమోదు కావడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణంమంటూ మండిపడ్డాయి. కాగా.. కరోనా పరిస్థితుల కారణంగానే పాస్ పర్సంటేజ్ నమోదైందని అధికార పార్టీ చెబుతోంది.
Maharashtra Political Crisis: ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?