కొత్త కమిటీల నిర్మాణంపై కేటీఆర్ సమీక్ష… కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల నిర్మాణంపై సమీక్ష చేశారు. అయితే, ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా గ్రామ కమిటీల నిర్మాణ వివరాలు అందజేశారు జనరల్ సెక్రటరీలు.
ఈ సందర్భంగా కీలక సూచలను చేశారు కేటీఆర్.. ఈనెల 15వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని జనరల్ సెక్రటరీలను ఆదేశించారు.. ఈనెల 20వ తేదీ నాటికి అన్ని మండల కమిటీలు నిర్మాణం పూర్తికావాలన్న ఆయన.. మండల కమిటీల నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా అధ్యక్షుల ఎంపికను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు.. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటుపైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామన్న ఆయన.. పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Tags
- hyderabad
- ktr
- KTR Review
- telangana
- TRS
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!