Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Trs Plenary In Hyderabad Tomorrow

TRS Plenary: గులాబీ సంబురం.. సర్వం సిద్ధం..

Published Date :April 26, 2022 , 9:04 pm
By Sudhakar Ravula
TRS Plenary: గులాబీ సంబురం.. సర్వం సిద్ధం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేసి, వారిలో ఉత్సాహం నింపేలా పార్టీ అధిష్టానం ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేల మందికి ఆహ్వానం పంపారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులంతా గులాబీరంగు దుస్తులు ధరించి హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధులంతా ప్రాంగణానికి చేరుకోవాలి. పేర్లు నమోదు చేసుకోవాలి. ఈసారి ప్రతినిధులకు బార్ కోడ్‌తో కూడిన ప్రత్యేక పాస్‌లను ఇచ్చారు. కోడ్‌ను స్కాన్‌ చేసి లోనికి అనుమతిస్తారు. పాస్‌లు లేనివారు రావొద్దని పార్టీ తేల్చి చెప్పింది.

Read Also: TS Group-1 Notification: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల..

ఇక, ఉదయం 11 గంటలకు కేసీఆర్ వేదిక మీదకు చేరుకుని అమరవీరుల స్తూపంవద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లాయి. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో చేసే తీర్మానాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని గులాబీ బాస్‌ కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలు ఉన్నట్లు టాక్. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీనా, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై తీర్మానాలు ఉంటాయని గులాబీ వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, పార్టీ సాధించిన విజయాలపై తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు దఫాలుగా అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారీ కూడా జైత్ర యాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతోంది. 80,039 ఉద్యోగ నియామకాలు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయల సాయం… 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు.. జీవో 111 రద్దు… ధాన్యం కొనుగోళ్లు.. తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధినేత కేసిఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక, టీఆర్ఎస్ ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 33 రకాల పసందైన వంట‌కాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల కటౌట్‌లతో అలంకరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • hyderabad
  • telangana
  • TRS party
  • TRS Plenary

తాజావార్తలు

  • PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

  • Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

  • Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions