టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి.. ఆ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రస్తావన తీసుకొచ్చారు.. అయితే.. ఈ సారి మాత్రం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రెండు కళ్లు.. ఒక వైపు చూస్తే కంటి చూపుపోతుందని వ్యాఖ్యానించారు.. ఇదే సమయంలో… ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికే రావాలి.. అదే ప్రొటోకాల్ అని స్పష్టం చేశారు రాజయ్య… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సర్పంచ్.. ఎమ్మెల్యే దగ్గరికే రావాలన్నారు.. ఎమ్మెల్యే దగ్గరికి రావడమే ప్రోటోకాల్ అని స్పష్టం చేశారు.. నేను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేను నా దగ్గరికి వస్తేనే.. నేను సీఎం దగ్గరకు వెళ్లి.. పనుల గురించి అడుగుతానని తెలిపారు.
Read Also: Akkineni Nagarjuna: భార్య నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున
గ్రామ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదేనన్న రాజయ్య.. నియోజకవర్గం సమస్యలు ముఖ్యమంత్రికి దృష్టికి ఎమ్మెల్యేలే తీసుకెళ్లారు.. గ్రామ సమస్యలు సర్పంచ్ లు ఎమ్మెల్యేల దృష్టి తీసుకురావాలన్నారు.. గ్రామాలకు అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యే పైనే ఎక్కువగా ఉంటుందని తెలిపారు.. ఇక, కడియం శ్రీహరి ప్రస్తావన మరోసారి తీసుకొచ్చారు తాటికొండ రాజయ్య… కడియం శ్రీహరికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇచ్చి ఆరు నెలలు అయ్యిందన్న ఆయన.. తాను ఎప్పటి నుంచో ఎమ్మెల్యేను అనే తరహాలో కామెంట్లు చేశారు.. అయితే, ఇద్దరినీ రెండు కళ్లలాగా చూసుకోండి,.. ఒక వైపే చూస్తే కంటి చూపు పోతుంది అని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ మధ్య ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడిచింది.. కడియం శ్రీహరి వల్ల 361 మంది నక్సలైట్లు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక రాజయ్య వ్యాఖ్యలకు కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతికి సంబంధించిన రికార్డులు అన్నీ తన దగ్గర ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.. అంతేకాదు ఆ తర్వాత.. కడియం శ్రీహరి చీకటి జీవితం అప్పటి టీడీపీ నేతలకు తెలుసు.. కడియం శ్రీహరి తనపై చేస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నా నంటూ మరోసారి రాజయ్య కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు తన ఆస్తులెంత? కడియం శ్రీహరి ఆస్తులెంత ? అంటూ ప్రశ్నించారు. ఇక, ఆ తర్వాత స్టేషన్ ఘనపురం టికెట్ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని.. తనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల్లోకి విస్తృతంగా పర్యటిస్తానన్నారు రాజయ్య.. మొత్తంగా.. ఇద్దరి మధ్య ఏదో ఓ తరహాలో చర్చ సాగుతూనే ఉంది.