బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. నిన్న బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆమె.. సీఎం కేసీఆర్, కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. దుబాయి గురించి మాట్లాడుతున్నావ్.. నేను 25 దేశాలకు వెళ్లాను.. స్వయంగా ప్రభుత్వమే నన్ను అమెరికాకు పంపించి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. మహిళలపై మాట్లాడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.. చీఫ్ లిక్కర్ తాగేవాళ్లకే దాని గురించి తెలుసు.. కాబట్టే పదే పదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.. నిన్నటి బీజేపీ కార్యక్రమానికి జనాలకు పైసలు ఇచ్చి తెప్పించుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే రేఖా నాయక్.
Read Also: Girlfriend Attacks Boyfriend: సీన్ రివర్స్.. ప్రియుడ్ని బ్లేడ్ తో దాడిచేసిన ప్రియురాలు
రాత్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళలు వచ్చి పైసలు ఇవ్వలేదని ఆందోళన చేసిన వీడియో తన దగ్గర ఉందన్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్.. తెలంగాణ సాధించుకున్నాకే రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.. అది కేసీఆర్ పాలనలో అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలకు తెలుసు.. నువ్వే ఎన్ని జూట మాటలతో అరిచినా ప్రజలు ఎవ్వరు పట్టించుకోరన్నారు.. బండి సంజయ్ మీరు ఎంపీ కదా..? మరి ఏమయ్యాయి కేంద్ర ప్రభుత్వ నిధులు..? గిరిజన యూనివర్సిటీని ఎందుకు తెప్పించడంలేదు..? అని నిలదీశారు.. సోయం బాపురావు నోరు అదుపులో పెట్టుకో.. నీ గురించి ఇంద్రవెల్లి చౌరస్తా కాడికి వచ్చి కూడా మాట్లాడుతా అని సవాల్ చేశారు.. తప్పులు చేస్తేనే రాథోడ్ రమేష్.. నీ భార్యపై కేసు నమోదైంది.. అది గుర్తు పెట్టుకో.. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ప్రజలకు ఏం అభివృద్ధి చేశావో చెప్పు అంటూ మండిపడ్డారు.. నీ కొడుకు రాథోడ్ రితేష్ అసిఫాబాద్ గిరిజనులు భూములు అక్రమంగా లాక్కున్నాడని ఆరోపించారు.. ఇక, రాజకీయాల్లోకి రాకముందే నాకు ఆస్తులున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మభ్య పెట్టె మాటలు చెబుతున్న బీజేపీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.. బీజేపీ నాయకులు నా గురించి గాని, టీఆర్ఎస్ గురించి గాని మాట్లాడితే బొందపెట్టి గోరి కడుతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్.