TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.. అయితే, ఆ నలుగురిలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు చెబుతున్నారు.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. దీంతో.. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇంతకీ రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఏంటి? అనే విషయాలను పరిశీలిస్తే.. రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, మూడో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌పై కేసులు పెట్టారు.. 120 బీ, 171బీ ఆర్/డబ్ల్యూ, 171 ఈ, 506 ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ మరియు Sec 8 of Prevention of corruption Act-1988 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు..
Read Also: TRS MLA’s Trap Issue: ప్రగతి భవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్‌మీట్..
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
బీజేపీలో చేరేందుకు 100 కోట్ల రూపాయల డీల్ నడిసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయలు ఇస్తామని తనతో డీలింగ్ నడిచినట్లు పేర్కొన్న యాన.. స్వామీజీ, నందు, సతీష్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.. డీలింగ్‌లో భాగంగానే తన ఫామ్ హౌస్ కు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు, ఇతర ఆధారాలను కూడా సేకరించారు.. రాత్రే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.. మొయినాబాద్ ఫామ్‌లోనే సతీష్‌ను విచారిస్తున్నారు పోలీసులు.. ఫరీదాబాద్ చెందిన సతీష్ ను ఫామ్‌హౌస్‌లోనే ఉంచి విచారిస్తున్నట్టుగా సమాచారం.. తిరుపతికి చెందిన సింహ యాజులు, నందులను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రశనిస్తున్నారని తెలుస్తోంది.. ఇవాళ సాయంత్రంలోగా ముగ్గురిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. మొత్తంగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!