Balka Suman: ప్రధాని పోస్ట్ శాశ్వతం కాదని, కావాలనే మా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారని రామగుండంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత్ బయోటెక్ వచ్చినప్పుడు క్రెడిట్ కోసం ప్రధాని ఒక్కరే వెళ్లారని అన్నారు. పీఎంవో నుంచి సీఎంఓకు గెస్ట్ ఆప్ ఆనర్ గా పిలవడం ఆనవాయితీ అని తెలిపారు. కానీ పిఎంవో నుంచి ఆహ్వానం లేదని అన్నారు. ఎరువుల శాఖ మంత్రి పేరుతో కేవలం పాల్గొనాలి అని మరోసారి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణ సమాజం నాలుగు కోట్ల జనాల్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వైఖరిని ప్రశ్నిస్తున్న తీరు బాధాకరమన్నారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేయమన్నారు రేపు ప్రకటించాలని, కార్మికులకు పెన్షన్ పెంచుతామన్నారు.. ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 11వ వేతన ఒప్పందం అమలు చేస్తామని ప్రకటించాలని అన్నారు. సీసీఐని ఆదిలాబాద్ జిల్లాలో పునర్ ప్రారంభం చేస్తామని చెప్పాలని అన్నారు. 14 నెల్ల కిందట ప్రారంభం అయిన ఎరువుల కర్మాగారం ఇప్పుడు మళ్లీ ప్రారంభించడం ప్రధాని డ్రామా అని మండిపడ్డారు.
read also: Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
10 మెడికల్ కాలేజీలు ఇస్తామని ప్రకటించాలని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందీ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించాలని తెలిపారు. తెలంగాణ పై ప్రేమ ఉంటే అన్నీ విషయాలపై ప్రకటించాలని అన్నారు. మీరు రామగుండం కు ఎందుకు వస్తారో మాకు తెలియదన్నారు. మీ దోస్తు అదానీకి,సింగరేణి బ్లాకులుని అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ లో మైన్ లు అక్కడి వారికి ఇస్తారు.. తెలంగాణ సింగరేణిలో ఇక్కడి వారికి ఇవ్వరని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి సిగ్గు ఉందా సీఎంను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎన్నాళ్ళు ఊడిగం చేస్తారు గుజరాత్ వాళ్లకు అని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రధాని గతంలో రెండుసార్లు వచ్చినప్పుడు ఆనాడు మా సీఎం కేసీఆర్ వస్తాం అంటే రావొద్దు అన్నారని గుర్తు చేశారు. రెండు సందర్భాల్లో కూడా అవమానించారని అన్నారు. ప్రధాని పోస్ట్ శాశ్వతం కాదని, కావాలని మా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Gudivada Amarnath: ప్రధాని మోడీ-పవన్ భేటీపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వారికి ఓట్లు, సీట్లు రెండూ లేవు..!