Crime News : టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్‌పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. మెడ భాగంలో దాడి జరగడంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రవిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవినాయక్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. రవినాయక్ మృతదేహాన్ని ప్రస్తుతం పోస్టుమార్టంకు తరలించారు. కొద్దిరోజులుగా కొంతమంది నేతలతో బానోత్ రవినాయక్ తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని కూడా స్వయంగా కొంతమంది తన సన్నిహితులతో రవినాయక్ పేర్కొన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే రవినాయక్ హత్యకు గురికావడం గమనార్హం. రవినాయక్‌కు భార్య పూజ, ముగ్గురు పిల్లలున్నారు.
కౌన్సిలర్ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ శరత్ పవర్ చంద్ర పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అనుమానితులు వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమికంగా రవినాయక్ హత్యకు రాజకీయ ప్రమేయం లేదని నిర్ధారించారు. రవి హత్య 11.30 నుండి 12 గంటల మధ్యలో జరిగిందని, పత్తిపక నుండి వెళుతున్న రవి మొదటి ట్రాక్టర్ తో అడ్డగించి, కారులో వచ్చిన వాళ్ళు గొడ్డలితో దాడి చేసినట్లు, ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
ఆర్ధిక లావాదేవీల వివాదమే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు మహాబాబూబాద్ ఎస్పీ శరత్ పవర్ చంద్ర తెలిపారు. ఈ హత్య ఛేదించేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు వేగం పెంచామని ఆయన తెలిపారు. ఈ దాడి సమయంలో రవినాయక్ ఒంటరిగా ఉన్నాడని, దాడి చేసిన అనంతరం దుండగులు పరారయ్యారని, వీరిలో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!