మహబూబాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్‌పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. మెడ భాగంలో దాడి జరగడంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రవిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా…