Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీది మైండ్ గేమ్.. 12 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్‌కి గిఫ్ట్ ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్‌ఎస్-బీజేపీ ప్లాన్ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణకి పూర్తి సమయం ఇస్తామని రాహుల్ గాంధదీ తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదన్నారు జగ్గారెడ్డి.
Read Also: Jagga Reddy: పోలీసులపై దండ యాత్ర.. రేపు ఖమ్మం వెళ్తున్నాం-జగ్గారెడ్డి
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు జగ్గారెడ్డి.. వరికి గిట్టుబాటు ధర లేదు.. వరి వేయొద్దు అని కేసీఆరే అనడం 40 శాతం వరి వేయలేదని.. ఈ విషయంలోనూ బీజేపీ-టీఆర్ఎస్ దాగుడు మూతల ఆట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, బండి సంజయ్ పనికి మాలిన మాటలు మాట్లాడతారు.. కేసీఆర్ తియ్యటి మాటలు చెబుతారు.. ఇద్దరితో రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి.. వరి వేయని రైతుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. ఆ రైతుల పొట్ట కొట్టింది టీఆర్ఎస్-బీజేపీయే అని ఆరోపించారు.. బండి సంజయ్ కి తు.. తెలియదు..తా తెలియదని సెటైర్లు వేసిన జగ్గారెడ్డి.. టీవీలను పిలిచి భౌభౌ అని అరుస్తారని.. రాజకీయం చేసేది అంతా సెంట్రల్ బీజేపీయే అన్నారు.. బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పరవాలేదు.. కానీ, కాంగ్రెస్ రావద్దని కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరోవైపు, వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు రైతులు, నిరుద్యోగులు అంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ బలోపేతం అవుతుందని.. ఐదు లక్షల మందితో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామన్నారు.. ఇక, తెలంగాణ నుండి 12 ఎంపీ సీట్లను గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..