Hyderabad: నేడు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లింలు, మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
చాపెల్ రోడ్డు మీదుగా జగ్జీవన్ రామ్ విగ్రహం జంక్షన్ వైపు వచ్చే వాహనాలను పోలీస్ కంట్రోల్ రూం మీదుగా దారి మళ్లిస్తామన్నారు. గన్ ఫౌండ్రీలోని ఎస్‌బీఐ మీదుగా బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని తెలిపారు. రవీంద్ర భారతి నుంచి జగ్జీవన్‌రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను సుజాత ఉన్నత పాఠశాల, పతే మైదాన్ మీదుగా దారి మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్ జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కింగ్ కోఠి నుంచి బొగ్గులకుంట మీదుగా బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను… పబ్లిక్ గార్డెన్ వైపు నుంచి వెళ్లేలా దారి మళ్లిస్తామన్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
Cyber Crime: గూగుల్ సెర్చ్ చేశాడు.. రూ.లక్ష పోగొట్టుకున్నాడు
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్‌లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!