నేడు చంచల్ గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయన ములాఖత్ అవనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయవాదులను కూడా నియమించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు…