తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం రైతుల హక్కులను కెసిఆర్ భంగం కలిగిస్తున్నారు. జగన్ జీఓ ఇవ్వకముందే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ తో కలిసి తాను కృష్ణా బోర్డ్ కి ఫిర్యాదు చేశామని రేవంత్ తెలిపారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత.. ప్రగతి భవన్ కి జగన్ ని పిలిచి పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టారు అని రేవంత్ ఆరోపించారు. రోజా ఇంటికి వెళ్ళి.. బేసిన్లు లేదు, భేషజాలు లేవు అన్నాడు కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో ఈ బేసిన్ ల కోసమే కదా.. 1200 మంది ప్రాణాలు త్యాగం చేశారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు.