NTV Telugu Site icon

Revanth reddy: తీగలాగితే డొంక కదిలిందా?! మీకర్థమవుతోందా?

Revanth Reddy

Revanth Reddy

Revanth reddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీక్…తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా…?! అంటూ రాసుకొచ్చారు. విచారణలో ‘బావ’…@CMOTelanganaలో బావమరిది…? మీకర్థమవుతోందా… “పరువు”గల @KTRBRS గారూ…! అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈమాటలకు టీఎస్ పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటా జత చేశారు. ప్రస్తుతం రేవంత్ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన చెప్పిన బావబామ్మర్ధులు ఎవరన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.

మరోవైపు పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే కమిషన్ సభ్యులకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, కమిషన్‌ సభ్యుడు లింగారెడ్డిలను సిట్‌ సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన రమేష్, లింగారెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్నాడని, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఇక మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లక్షల రూపాయలు చేతులు మారాయని, హవాలా కోణం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. మనుషుల ముసుగులో మృగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియ జాగ్రత్తగా జరగాలని రేవంత్ దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాలు వందల కోట్లకు అమ్ముడుపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులపై అక్రమ అరెస్టులు, కేసులు పెడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. అయతే రేవంత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ బావబామ్మర్దులు ఎవరు? అంటూ ఉత్కంఠంగా మారుతుంది.
Ambati Rambabu: నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటా..

Show comments