Revanth Reddy: జగ్గారెడ్డి మా నాయకుడు.. మేమంతా అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది.. దీనిపై స్పందించిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డి ఇష్యూ మా దృష్టికి వచ్చింది.. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి మా నాయకుడు.. మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరారు.. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటామని.. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.. గతంలో సీనియర్ నేత వీహెచ్‌పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. ఆరా తీస్తే ఆ వ్యక్తి కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి..
Read Also: Shiv Sena: కాంగ్రెస్ లేకుండా అది సాధ్యం కాదు..! స్పష్టం చేసిన సంజయ్ రౌత్..
Also Read
జగ్గారెడ్డి ఇష్యూ మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపారు రేవంత్‌రెడ్డి.. పీసీసీ చీప్‌గా కొన్ని నేను బయటికి చెప్పలేనన్న ఆయన.. జగ్గారెడ్డి నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడన్నారు.. నేను రాజకీయాలకు రాకముందు కూడా జగ్గన్నతో పరిచయం ఉందన్న ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకరావడానికి మేం అందరం కలిసి పనిచేస్తాం అని ప్రకటించారు.. ఇక, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు వచ్చాయని కుంగిపోవద్దు అని సూచించారు రేవంత్‌రెడ్డి.. మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారన్న ఆయన.. ఇలాంటి విషయంలో మరింతగా బలంగా ఉండాలన్నారు.. నాకు ఇలాంటివి సోషల్ మీడియాలో చాలాఎదురయ్యాయని గుర్తుచేసుకున్న రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!