Site icon NTV Telugu

TPCC Mahesh Goud : స్థానిక సంస్థల ఎన్నికలపై బాంబు పేల్చిన టీపీసీసీ చీఫ్‌

Mahesh Goud

Mahesh Goud

TPCC : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ శుక్రవారం ఒక సంచలన ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా మొత్తం 650 మంది ఫోన్‌లు ట్యాప్‌ చేసిన చారిత్రక దౌర్భాగ్యానికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని పేర్కొన్నారు.

Iran-Israel : మరోసారి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు

మా లాంటి నాయకుల ఫోన్‌లతో పాటు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరమని, ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ప్రమేయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్‌ జరిగినట్లు తమ అనుమానం అని స్పష్టం చేశారు. ట్యాప్ అయిన వారందరూ స్వచ్ఛందంగా విచారణకు హాజరుకావాలని మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.

“సిట్‌ను మేము కోరుతున్నాం. ట్యాప్ అయిన 650 మంది పేర్లను బహిర్గతం చేయాలి. ప్రభుత్వ విధానాలే ప్రశ్నార్ధకంగా మారాయి,” అని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన మరోసారి విమర్శలు చేశారు. “కాళేశ్వరం పేరుతో కోట్లు నదుల్లో కలిపారు. నాసిరకం పనులతో ప్రజాధనాన్ని వృథా చేశారు,” అని ఆరోపించారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇంకా ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. “మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం,” అని తెలిపారు.

Salman khan : ఆరోగ్య సమస్యల‌పై తొలిసారి స్పందించిన సల్మాన్..

Exit mobile version