ఈ సృష్టి చిత్ర విచిత్రాలకు వేదిక. వర్షం వచ్చినప్పుడు మనకు ఆకాశంలో హరివిల్లు విరుస్తుంది.. ఆ దృశ్యం ఎంతో చూడముచ్చటగా వుంటుంది. అమెరికాలో సంభవించే టోర్నెడోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టోర్నెడోల వల్ల భారీగా నష్టం చేకూరుతుంది. గత ఏడాది టోర్నెడోల వల్ల భారీగా నష్టం సంభవించింది. వందమందికి పైగా ఈ బీభత్సం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా టోర్నెడో లాంటి సీన్ తెలంగాణలో కనిపించింది. అమెరికాతో పోలిస్తే ఇక్కడేం నష్టం సంభవించలేదు. ఆకాశంలో కాసేపు అద్భుత దృశ్యం ఆవిష్కృతమయింది.
గత ఏడాది అమెరికాలో సంభవించిన టోర్నెడో దృశ్యం ఇది….

Read Also: Special Story on Teacher’s Day: ఎందరో టీచర్లు.. అందరికీ వందనాలు..
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో వున్న సింగూరు ప్రాజెక్టు ఈ టోర్నెడోలాంటి సీన్ కి ఆలవాలం అయింది. మంజీరా నదిలో టోర్నెడోలను తలపించిందీ దృశ్యం.. నదినుంచి ఆకాశం వైపు తెల్లని ధార కనిపించింది. మూడు నిమిషాల పాటు నింగి కెగసింది నీరు.. సింగూరు ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఎన్టీవీకి చిక్కింది. ఈ సీన్ చూసి అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇదేంటి ఇలా జరిగింది.. దీనికి కారణం ఏంటని ఆరా తీయడం కనిపించింది. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Asia Cup 2022: పాక్ చేతిలో టీమిండియా ఎలా ఓడిపోయిందంటే…

మంజీరా నది దగ్గర కనిపించిన దృశ్యం ఇది