నారాయణస్వామిపై ప్రభుత్వ విప్ హాట్ కామెంట్స్.. అలా జరిగితే నేనైతే ఊరి వేసుకొని చచ్చిపోతా..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్.. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారాయణస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారాయణస్వామి ఓ పిచ్చోడు, అవినీతిపరుడు అని విరుచుకుపడ్డారు.. సిట్ అధికారులు మీ ఇంటికొస్తే సాష్టాంగంగా వారి కాళ్లపై పడిపోయావు.. దీనికన్నా గలీజ్ ఏమైనా ఉందా? అని ఫైర్ అయ్యారు.. మేమైనా అవినీతి చేశామా, మేము ఏమైనా పోలీసులు కాళ్లు పట్టుకున్నామా..? అని ప్రశ్నించారు..
సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు.. నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్..
ఢిల్లీ – తెలంగాణలో లోకల్ కోటా కింద ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి. స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదువితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్ లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందనే షరతు పెట్టింది సుప్రీం కోర్ట్. లోకల్ రిజర్వేషన్ అంశంపై తెలంగాణకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వరుసగా నాలుగేళ్లు అంటే 9వ, 10వ, 11వ, 12వ తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికుడిగా పరిగణించాలని స్పష్టంచేసింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. స్థానికత అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 33కి అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయి మద్దతు తెలిపింది.
కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు.. దొడ్డిదారిన ప్రైవేటీకరణ..!
స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు చెబుతున్నారు.. కానీ, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికా 50 శాతం సుంకం విధిస్తే కూటమి మాట మాత్రం కూడా స్వందించడం లేదు.. దేశ ఆత్మ గౌరవం ప్రమాదంలో పడిందన్నారు.. ఆక్వా రంగం పూర్తిగా దెబ్బ తింటుంది.. ఎగుమతులు కుదెలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యుత్, ఫీడ్, సీడ్ రేట్లు పై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. గార్మెంట్స్ లో 18వేల ఉద్యోగాలు పోయాయి.. ఉద్యోగాలు ఇస్తామని చెపుతూ.. ఉన్న ఉద్యోగాలను కాపాడలేకపోతున్నారు.. స్పీన్నింగ్ మిల్స్ విద్యుత్ రేట్లు కారణంగా 35 శాతం పరిశ్రమలు మూత పడ్డాయి.. రైతులకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
వ్యక్తిగతంగా కోరుతున్నా.. తెలుగు వారు సుదర్శన్ రెడ్డి గెలుపుకు నిలబడాలి!
ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని.. తెలుగు వారు అందరూ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్.. ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సుదర్శన్ రెడ్డితో తెలంగాణ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
800కు చేరిన ఆప్ఘనిస్థాన్ భూకంప మృతుల సంఖ్య.. 2,500 మందికి తీవ్రగాయాలు
ఆప్ఘనిస్థాన్‌ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి వచ్చిన భూకంపంతో తాలిబన్ల దేశం వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 6.0తో భూకంపం వచ్చింది. దీంతో ఎటుచూసినా శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటి వరకు 800 మంది చనిపోగా.. 2,500 మందికి తీవ్రగాయాలు అయినట్లు ఆప్ఘనిస్థాన్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.
ఆ ఒక్క కారణంగానే.. ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా!
తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, ప్రతిపక్షాల అభ్యర్థిని అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని స్పష్టం చేశారు. రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది తనను అడిగారని చెప్పారు. తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, ఏ పార్టీలో సభ్యత్వం లేదని, ఇక ముందు కూడా ఉండదని పేర్కొన్నారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతా అని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సీఎం రేవంత్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు.
దుండిగల్‌లో విషాదం.. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన తండ్రి-కొడుకులు మృతి
దుండిగల్‌లో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన తండ్రి-కొడుకులు అదృశ్యమై మృతదేహాలుగా బయటపడ్డారు. వివరాల ప్రకారం, దుండిగల్‌కు చెందిన శ్రీనివాస్ తన కుమారుడితో పాటు వెస్లీ కాలనీ వాసులతో కలిసి ఆటోలో గణేష్ నిమజ్జనానికి వెళ్లారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత కాలనీ వాసులు ఇంటికి చేరుకున్నారు. అయితే శ్రీనివాస్, అతని కుమారుడు మాత్రం తిరిగి రాలేదు. ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసులను సంప్రదించారు. చెరువు పరిసరాలను పరిశీలించిన పోలీసులు, అక్కడ రాయి చిందరవందరగా కనిపించడంతో ఆటో చెరువులో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, తండ్రి-కొడుకుల మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
iBomma కుప్పకూలుతుందా..? హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సూపర్ ఆపరేషన్..!
విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా iBomma, Bappam వంటి సైట్లు, వాటికి సంబంధించిన మరో 65 మిర్రర్ డొమైన్లు ఇప్పుడు విచారణలో ఉన్నాయి. ఈ కేసులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు అయ్యాయి. పైరసీ కారణంగా పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని ఛాంబర్ స్పష్టంగా తెలిపింది.
హరీష్‌రావు వల్లే కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ.. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెబుతున్నా..
మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను అవినీతి ఆరోపణలతో లాగడం వెనుక హరీష్‌రావే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు. “తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఆయనకు తిండి మీద, డబ్బు మీద ఎప్పుడూ యావ ఉండదు. అలాంటి నాయకుడిని అవినీతి మచ్చతో మసకబార్చారు. నిజాం కంటే కేసీఆర్ ఆస్తిపరుడు కావాలని అనుకున్నాడు అంటున్నారు.. నిజంగానే నిజాం స్ఫూర్తి గానే సాగుతాం,” అని కవిత వ్యాఖ్యానించారు.
