NTV Telugu Site icon

Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!

Kavitha Arest

Kavitha Arest

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో ఈడీ దూకుడు పెంచింది. కీలకమైన విషయాలను సేకరించేందుకు కస్టడీ విచారణ జరుగుతోంది. మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఈడీ నిబంధనలను ఉల్లంఘించారని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. తన అరెస్టు చట్టవిరుద్ధమని, తనపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read also: Arvind Kejriwal Arrested: అరెస్ట్‌ అయినా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించనున్న కేజ్రీవాల్

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేల ఎం. త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసును రిమాండ్ చేయడంతో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో… కవితకు ఊరట లభిస్తుందా..? లేక ఇతర పరిణామాలు చోటుచేసుకుంటాయా అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ కేసులో కవిత రిమాండ్ గడువు మార్చి 23తో ముగియనుంది.ఈ క్రమంలో మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ మరో పిటిషన్ దాఖలు చేయనుందా…? మరి కస్టడీకి అడుగుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
WhatsApp : వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్..!