తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా ఈరోజు ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,469కి చేరింది. కరోనా నుంచి 6,65,755 మంది కోలుకోగా మొత్తం 3,973 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది అని సర్కార్ పేర్కొంది.