Tipper lorry disaster in Wipro circle: నగరంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ ల మీదకు టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Read also: Gudivada Tension: గుడివాడలో టెన్షన్.. టెన్షన్
భాగ్యనగరంలో గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో కూడలి వద్ద రెడ్ సిగ్నన్ పడటంతో కార్లు, బైక్ లు నిలబడ్డాయి. అయితే రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా టిప్పర్ లారీ డ్రైవర్ ముందుకు కదిలాడు దీంతో ముందుగా వున్న 4కార్లు, 2బైక్ లు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ ల మీదకు టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో నాలుగు కార్లు, 2 ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కార్లులో వున్న వారికి, రెండు బైక్ లపై ప్రయాణించే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, 6 గురికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతి చెందిన వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసే బాయ్ నసీర్ గా గుర్తించారు పోలీసులు. ఉదయం ఫుడ్ డెలివరీకి వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అయితే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో.. నసీర్ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈబీభత్సాన్ని సృష్టించిన టిప్పర్ లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందా? అనేది ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఇంకా వేరే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ తాగిన మత్తులో సిగ్నన్ క్రాస్ చేసే ప్రయత్నంలో ఈఘటన జరిగిందా? లేక ఉదయం చలి పొగమంచు కారణంగా ఈఘటకు దారితీసిందా అనేకోనంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
USA: మంచు తుఫాన్‌తో అల్లాడుతున్న అమెరికా.. 31 మంది మృతి