భారతదేశం వందకోట్ల టీకాల మైలురాయిని దాటి ఒక సరికొత్త చరిత్రను ఈరోజు సృష్టించింది. ఈ సందర్భంగా కోవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు.మహమ్మారి పై పోరాటం లో భాగంగా వందకోట్ల టీకా డోసులు అందించి భారతదేశాన్ని సగర్వంగా నిలిపిన సైంటిస్టులకు, టీకా తయారీదారులకు సెల్యూట్ అంటూ తెలంగాణ గవర్నర్ డా.తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. భారతీయురాలిగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను. 100 కోట్ల టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది. ఈ విజయం వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ది, ఈ సందర్భంగా ప్రధాని మోదికి కృతజ్ఞతలు అన్నారు గవర్నర్.
ఈ విజయంతో అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి. భారత్ లాంటి జనాభా ఎక్కువగా వున్న దేశాలు ఇలాంటి విజయం సాధించడం నిజంగా అంత సులభం కాదు. స్వదేశంలో తయారైన వ్యాక్సిన్ లను మనం ప్రజలకు అందించాము. 100 దేశాలకు భారత్ వ్యాక్సిన్ అందించింది. వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన సంస్థలను ప్రధాని స్వయంగా సందర్శించి… పరిశోధకులను ప్రోత్సహించారు. వ్యాక్సిన్ తీసుకొని వారే ఎక్కువగా కోవిడ్ తో తీవ్ర ప్రభావాలు ఎదుర్కొంటునట్టు నివేదికలు చెబుతున్నాయి. విడతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం కలిసి వచ్చింది. 2 నుంచి 18 ఏళ్ల వారికి వాక్సినేషన్ అందించుకునే స్థాయికి చేరాం.
ఈరోజు ఉదయం 9.47 నిమిషాలకు మనం 100 కోట్ల మార్క్ ని చేరాం. డిజిటల్ గా వాక్సినేషన్ ని రికార్డ్ చేయడం, సర్టిఫికెట్ ఇవ్వడం అందరికి అవగాహన కల్పించడంలో విజయం సాదించాము. భారతీయులు ఏదైనా అనుకుంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా విజయం సాధిస్తారని నిరూపించాము. ఇంకా వాక్సిన్ తీసుకొని వారు తప్పక టీకా తీసుకోవాలని కోరుతున్నాను. టీకా తీసుకోవడం ద్వారా దేశాన్ని కాపాడ వచ్చన్నారు తమిళ సై సౌందరరాజన్.