బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్..
చిన్నారులు, యువతులు అనే తేడా లేకుండా.. చదువుకునే ప్రాంతంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పాడుబుద్ధి చూపిస్తున్నారు.. బోధనేతర సిబ్బంది కూడా చిన్నారులపై లాంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో.. అయితే, వీటిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీ ఆనంద్ వెల్లడించారు.. చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం…
కరోనా థర్డ్ వేవ్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ విరుచుకుపడింది.. దీంతో.. కఠిన ఆంక్షల బాటపట్టింది ఆ రాష్ట్రంలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సర్కార్.. అయితే, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఇప్పటికే పలు సడలింపులు ప్రకటించిన ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి మరిన్ని ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో.. నేటి నుంచి ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోబోతున్నాయి.. మొదటి దశలో 9 నుంచి 12 తరగతుల వరకు ఆన్‌లైన్,…
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు…
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్‌డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్‌డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది.…