Man Assaults Woman: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన ఘటన వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకు. ఈ ఘటన హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో జరిగింది.
Read also: Rain Alert: తెలంగాణలో మూడు రోజుల్లో వర్షాలు
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక, కుటుంబంతో సహా.. మార్చి ఒకటో తేదీన కళ్యాణ్ నగర్ లో ఉండే బంధువుల ఇంటికి 17 ఏళ్ల బాలిక తల్లితో కలిసి వెళ్ళింది. అక్కడ బంధువులు 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే దానికి బాలిక ఒప్పుకోలేదు. తను ఇప్పుడే పెళ్లి చేసుకోనని ఇష్టం లేదని చెప్పింది. దీంతో ఇరువురు కుటుంబసభ్యులు సైలెంట్ అయిపోయారు. అయితే ఆ బాలిక యువకుడిని పెళ్లి చేసుకోను అనడంతో ఆయువకుడు సతీష్ కు ఆమె మాటలు నచ్చలేదు. ఆ బాలికపై ఆగ్రహం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ఆబాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం వేచి చూశాడు. దీంతో ఆ సమయం రానే వచ్చింది. ఇంట్లో బాలిక ఒక్కేటే ఉందని తెలియడంతో.. సతీష్ ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. దీంతో ఆబాలిక సతీస్ ఎందుకు వచ్చావని అడగింది. నాతో పెళ్లికి వద్దంటావా అంటూ ఆగ్రహంతో ఆమెను గదిలోకి లాక్కెళ్లి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా ఆమె మీద అనేక సార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థంకాక ఆ బాలిక తనలోనే కుమిలిపోయింది. అయితే.. ఇటీవల మూసాపేట ప్రాంతంలో ఉండే బాలిక అమ్మమ్మ అనారోగ్యంతో ఉండడంతో చూడడానికి వచ్చారు. ఆ సమయంలో బాలిక ఎదో కోల్పోయినట్లు ఉండటం గమనించిన అమ్మమ్మ ఏం జరిగిందని ఆరా తీసింది. బాలిక నిర్ఘాంతపోయే విషయాలు అమ్మమ్మకు చెప్పడంతో.. అమ్మమ్మ మొదట షాక్ అయ్యింది. అనంతరం బాలికను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అయితే.. నిందితుడు సతీష్ ను అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు.
Bombay High Court: మైనర్ వీపును తాకడం లైంగిక వేధింపులా?
