కవులు, కళాకారులు కన్న తెలంగాణ రాలేదని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. మంగళవారం ఆయన భువనగిరి మండలం హనుమపురం కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జంగు ప్రహ్లాద్‌కు మనం ఘనంగా నివాళులర్పిం చాలన్నారు. మా భూములు, మా నీళ్లు, మా వనరులు,మా పాలన ఇంకా మాకు రాలేదన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాణం ఈ భూమిలోనే ఉందని తెలంగాణ సమస్య అంటే…
జనన నాట్య మండలి సీనియర్ కళాకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతో పాటు తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించారు ప్లహ్లాద్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయన హైదరాబాదులోని జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన…