NTV Telugu Site icon

Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్‌ రావు డిమాండ్‌

Harish Rao

Harish Rao

Hariah Rao: రైతులకు రూ.10వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్‌ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని తెలిపారు.

Read also: TDP MP Candidates List: సిద్ధమైన టీడీపీ ఎంపీల జాబితా..! ఈ రోజే విడుదలకు ఛాన్స్..

వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని గుర్తు చేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని కోరారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Read also: IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాట‌ల హోరే!

కాగా.. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. విర్నపల్లిలో వరి కోత దశలో ఉన్న పంట పొలాలపై ఆకాల వడగళ్ల వర్షానికివరి పంటలు నేల రాలాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో అన్నదాతను వర్షం ఆగం చేసింది. ఆకాలవర్షంతో వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పలుచోట్ల నెలకొరిగాయి. ఈదురుగాలులకు మామిడి పంట రాలిపోయింది. పంట చేతికివచ్చే సమయానికి నేలపాలయ్యిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
DGP Brothers: సొంత అన్నదమ్ముళ్లే ఆ రెండు రాష్ట్రాలకు పోలీస్​ బాస్​ లు..!