NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav: తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు. ఓపిక తో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని సూచించారు. తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ వల్ల నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది మేము దానిని అంగీకరిస్తున్నామన్నారు.

Read also: Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

పేపర్ లీక్ లో బీఆర్ఎస్ నేతలకు ఎటువంటి సంబంధం లేకున్నా ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలపై ఇష్టా రీతిలో మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మర్యాద తెలియదని మండిపడ్డారు. బండి పోతే బండి, పోతే గుండు అంటూ ఎద్దేవ చేశారు. అసలు బండి సంజయ్ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల సికింద్రాబాద్ కు రూపాయి పని జరగలేదని మండిపడ్డారు. పార్టీలో అసంతృప్తి ఉంటె.. చెప్పేరీతిలో చెప్పండి అని తలసాని తెలిపారు.
R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి