TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
- 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు
- రూ.7.19 లక్షల ఆహార పదార్థాలు స్వాధీనం
- 21 నమూనాలు సేకరించిన అధికారులు
- మూడు డెయిరీల FSSAI లైసెన్సులు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SAFE : కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నగర పరిధి, పరిసర ప్రాంతాల్లోని పనీర్, పాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. 12 బృందాలుగా ఏర్పడిన అధికారులు మొత్తం 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని కేంద్రాల్లో పనీర్ అనలాగ్స్ తయారీకి లూజ్ పామ్ ఆయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పలుచోట్ల బొద్దింకలు, ఈగల బెడదతో పాటు పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడం, పాల సేకరణ రికార్డులు లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.
Also Read
కల్తీపై అనుమానంతో అధికారులు 21 ఆహార నమూనాలు సేకరించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.7,19,340 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు ఒక టన్ను లూజ్ పామ్ ఆయిల్, 476 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్, 1,760 ప్యాక్ల కుకింగ్ క్రీమ్, 150 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉన్నాయి. మరోవైపు రెండు సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, మరో రెండు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. లక్ష్మీ ఫుడ్స్, ధనలక్ష్మీ డెయిరీ ప్రొడక్ట్స్, నటరాజ్ మిల్క్ అండ్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని TG SAFE స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
-
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!