Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
- నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ముఠా మకాం
- ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో మాదకద్రవ్యాల తయారీ
- మౌలాలీ ల్యాబ్‌పై ఎన్సీబీ దాడులు.. పలువురి అరెస్ట్
- రసాయనాల సరఫరా నుంచి అంతర్జాతీయ లింకుల వరకు దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివార్లలో ఫార్మా పరిశ్రమల ముసుగులో సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠా గుట్టును దర్యాప్తు సంస్థలు రట్టు చేశాయి. ప్రాణాంతక డ్రగ్స్ అయిన ఆల్ప్రాజోలం, ఎఫిడ్రిన్, మెఫెడ్రోన్లను భారీ ఎత్తున తయారు చేస్తూ యువతను మత్తు ఊబిలోకి నెడుతున్న నెట్‌వర్క్‌ను ‘ఈగల్ ఫోర్స్’ విజయవంతంగా ఛేదించింది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఈ రాకెట్ వెనుక బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
నాగ్‌పూర్‌లో సెగ తగలడంతో హైదరాబాద్‌కు మకాం..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న మత్తుమందుల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించడంతో.. ఈ ముఠా ప్రధాన సూత్రధారి చేతన్ మేశ్రామ్ తన స్థావరాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. అస్సాంకు చెందిన ఆయూబ్ అనే వ్యక్తి సాయంతో నగరానికి వచ్చిన చేతన్.. కొండమడుగులోని ‘వేటుకూరి లాబ్స్’ యజమాని రామరాజు నుంచి ఓ రియాక్టర్‌ను లీజుకు తీసుకున్నాడు. గతంలో అదే లాబ్‌లో పనిచేసిన కాసాని శ్రీనివాస్, ఆయూబ్లతో కలిసి పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీకి వ్యూహం రచించాడు.
Also Read
యాసిడ్ లేబుల్‌తో పక్కాగా రవాణా..
డ్రగ్స్ తయారీకి అత్యంత కీలకమైన ‘ప్రొపియోనైల్ క్లోరైడ్’ అనే రసాయనాన్ని గుజరాత్‌లోని వల్సాద్ నుంచి సేకరించారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు చేతన్ దీనిని హైడ్రోక్లోరిక్ యాసిడ్‌గా మార్చి లేబుళ్లు వేసి నాగ్‌పూర్ మీదుగా కొండమడుగు లాబ్‌కు తరలించేవాడు. ఇలా పలుమార్లు రహస్యంగా రసాయనాలను రవాణా చేసి కొండమడుగు లాబ్‌లో భారీ ఎత్తున మెఫెడ్రోన్‌ను తయారు చేశారు. అయితే 2026 ఆగస్టులో తయారు చేసిన 25 కేజీల మెఫెడ్రోన్‌ను బీబీనగర్ పోలీసులు మాటువేసి పట్టుకోవడంతో వీరి ఆగడాలకు తొలిసారి బ్రేక్ పడింది.
మౌలాలీ ల్యాబ్‌లోనూ దందా.. ఎన్సీబీ మెరుపు దాడి
అంతటితో ఆగని చేతన్ ముఠా.. మౌలాలీలోని ‘ఎస్ఎం లాబ్స్’ యజమాని మాణిక్ రెడ్డి నుంచి మరో రియాక్టర్‌ను లీజుకు తీసుకుంది. ఆ లాబ్ కెమిస్ట్ చాగంటి వెంకట లక్ష్మీకుమార్ సహకారంతో పెద్ద ఎత్తున ఆల్ప్రాజోలం, ఎఫిడ్రిన్‌ను తయారు చేశారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎస్ఎం లాబ్పై దాడి చేసి కాసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, రమేశ్‌గౌడ్, లక్ష్మీకుమార్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈ ముఠాకు రసాయనాలు చేరవేస్తున్న ముంబై వాసాయికి చెందిన ‘జేఎస్వీ గ్లోబల్స్’ యజమాని జైరాజ్ కృష్ణ శెట్టిని ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.
అంతర్జాతీయ లింకులు.. బంగ్లాదేశీయులతో పనులు
ఈ కేసుకు సంబంధించి బయటపడుతున్న వివరాలు భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అస్సాంకు చెందిన ఆయూబ్, మువ్జమిల్ అనే కెమిస్ట్‌తో కలిసి చేతన్ ఈ వ్యవహారం నడిపించాడు. తయారీ కేంద్రాల్లో పనిచేసేందుకు ఆయూబ్ అస్సాం నుంచి కూలీలను సమకూర్చాడు. అయితే, వీరంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన వలసదారులుగా అధికారులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ రవాణా, తయారీ వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
-
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
ట్రెండింగ్
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?