Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju on Girish AD: మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ‘ప్రేమలు’, ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా బెత్లెహోమ్ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మమితా.. దర్శకుడు గిరీష్ ఏడీపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు గిరీష్ తనపై నమ్మకం ఉంచి కీలక పాత్రలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు హీరోయిన్గా నటించే సామర్థ్యం ఉందని తాను నమ్మని సమయంలోనూ గిరీష్ తనపై విశ్వాసం ఉంచారని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నన్ను నమ్మడానికి ఆయనకు ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలియదు అని మమితా పేర్కొన్నారు.
‘సూపర్ శరణ్య సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గిరీష్ ఏడీ నాకు బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ కథ చెప్పారు. అప్పటికి సూపర్ శరణ్య సినిమా విడుదల కూడా కాలేదు. అయినప్పటికీ బెత్లెహోమ్ కథలోని పాత్రకు నేను సరిపోతానని గిరీష్ భావించారు. ఆ పాత్రను నేను చేస్తేనే బాగుంటుందన్నారు. ఆయనకు నాపై అంత నమ్మకం ఎలా కలిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఈ విషయంలో నాకు సందేహంగానే ఉంది. మెయిన్ హీరోయిన్ పాత్రను నేను చేయగలనని నమ్మని సమయంలో.. గిరీశ్ నాపై నమ్మకం ఉంచారు. ప్రేమలు, బెత్లెహోమ్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో నిలబడి ఆయనకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. థ్యాంక్యూ’ అని మమితా బైజు భావోద్వేగం చెందారు.
Also Read
బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ విజయోత్సవ వేడుకలో చిత్ర బృందంలోని సభ్యులందరికీ మమితా బైజు ధన్యవాదాలు తెలిపారు. కెమెరా ముందు నటించిన వారితో పాటు తెరవెనుక పనిచేసిన సాంకేతిక నిపుణుల కృషిని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా విజయానికి ప్రతి ఒక్కరి సహకారం ఉందని పేర్కొంటూ.. తన సహనటులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన బెత్లెహోమ్లో నివిన్ పౌలీ, మమితా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!