గవర్నర్ తమిళిసై ను కలిసిన టి.ఎఫ్.సి.సి. ఛైర్మన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తో పాటు, తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మన్ నెహ్రు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తదితరులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను వారి కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పదివేల మంది సభ్యులున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు, సభ్యుల మధ్య ఉన్న ఐక్యమత్యాన్ని, ముందుండి దిశానిర్దేశం చేస్తున్న ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ను గవర్నర్ అభినందించారు. ఇదే సమయంలో తెలంగాణ చిత్ర పరిశ్రమలోని సమస్యలను టిఎఫ్‌సిసి ఛైర్మన్ గవర్నర్‌కు విన్నవించారు. ముఖ్యంగా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం నిర్మాతలకు, థియేటర్లకు జీఎస్టీ మినహాయించాలని కోరారు. ఈ సమస్యలపై గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారు. తెలంగాణ చిత్ర పరిశ్రమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి టిఎఫ్‌సిసి కార్యవర్గాన్ని అభినందించినందుకు ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ గవర్నర్ తమిళిసై కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
- CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
తాజావార్తలు
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..