హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది.. అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు… అన్ని ప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత… మండలాల వారిగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు… విస్తృతంగా పర్యటించి… గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం మొదలు… పోలింగ్ రోజు ఓటర్లను పోలింగ్ బూతులకు చేర్చే వరకు పక్కా…