తెలంగాణాలో ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాధాలలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. నిన్న ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయ్యారు.. ఇక ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి.. తాజాగా కరీంనగర్ లో ఘోరం జరిగింది.. పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో యువకుడు బస్సును ఢీ కొట్టాడు. ఈ క్రమంలో వ్యక్తి ప్రాణాలను కోల్పోయిన ఘటన స్థానికంగా కలచి వేసింది..
వివరాల్లోకి వెళితే.. తెలంగాణక రీంనగర్‌లో పోలీసుల డ్రంకెనడ్రైవ్ తనిఖీనిలు నిర్వహించారు.. ఈ క్రమంలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.. దాంతో వెనకాల వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీ కొట్టాడు.. స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయాడు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎలువాక శ్రీనివాస్(33) కరీంనగర్‌లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి తన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరి బద్దం ఎల్లారెడ్డి చౌరస్తా సమీపంలో పోలీసులు డ్రంకెనడ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని గమనించాడు. వెంటనే తన బైక్‌ను వెనక్కి మళ్లించాడు..
పోలీసులను తప్పించుకునే యత్నంలో శ్రీనివాస్ ఎదురుగా వస్తున్న హుజూరాబాద్ డిపో ఆర్టీసీ బస్సును వేగంగా ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులు పట్టుకునే క్రమంలోనే శ్రీనివాస్ మృతి చెందాడని ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు ఏసీపీ శ్రీనివాసరావు, పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల ఆందోళన విరమింపజేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. తెలంగాణా లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.. ఇటీవల హైదరాబాద్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ఉదయం మూడు గంటల వరకు కూడా పోలీసులు తనిఖీలను నిర్వహిస్తున్నారు.. దాంతో కొంతవరకు ఈ కేసులు తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు.. ప్రస్తుతం జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..