తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని
వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశమున్నట్లు తెలిపింది. జులై 21న వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ ద్రోణి, మధ్య ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు, విదర్భ తెలంగాణ రాయలసీమ మీదుగా ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉంది. కాగా, ఐదారు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలతో భారీ వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమతున్నాయి.