నేడు టెట్ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేసింది. అయితే.. టెట్ నోటిఫికేషన్ లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు వెల్లడించాల్సిన.. కానీ అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఇవాల్టి ఉదయం 11.30 నిమిషాలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ఫలితాలను https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు పరీక్షలు జరుగుతూనే.. మరో వైపు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇలా వరుసగా.. మొన్న ఇంటర్, నిన్న టెన్త్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇవాళ టెట్ ఫలితాలను విడుదల చేయనుంది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ పరీక్షల ఫలితాల విడుదలలో బిజీగా ఉన్నారు. నేడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టెట్ పరీక్షా ఫలితాలు విడుదలు చేయనున్నారు. అయితే.. జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1.. పేపర్ 2 పరీక్షలు జరిగగా.. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది, పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరుకాగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. కాగా.. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. అయితే.. రెండు రోజుల క్రితం తుది కీ విడుదల చేయగా.. తుది కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేశారు.