Site icon NTV Telugu

TS TET 2024: టెట్‌ దరఖాస్తులు షురూ.. ఎప్పటి వరకు అంటే..?

Tet Ts 2024

Tet Ts 2024

TS TET 2024: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) దరఖాస్తు ప్రక్రియ నిన్న (బుధవారం) నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో https://tstet2024.aptonline.in/tstet/లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం, ఆన్‌లైన్ ఆధారిత టెట్ పరీక్ష మే 20 మరియు జూన్ 3 మధ్య రెండు సెషన్‌లలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలు ఉదయం 9 నుండి 11.30 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి. మే 15 నుంచి హాల్ టిక్కెట్లు.. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల చేయనున్నారు. ఇక టెట్ రాయడానికి పేసర్ రూ. 1000, రెండు పేపర్లు రాయడానికి రూ. 2 వేలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Read also: GHMC Hyderabad: పన్నులు కట్టకుంటే కఠిన చర్యలు.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

టెట్ పేపర్-1 రాయడానికి డీఈడీ, పేపర్-2 రాయడానికి డిగ్రీ, బీఈడీ. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ (డీఎస్సీ) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఉద్యోగాలలో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 PETలు మరియు 6508 SGTలు ఉన్నాయి. ఇంకా, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్ మరియు 796 SGT పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో 878, ఖమ్మంలో 757, నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 ఖాళీలు ఉన్నాయి.
MI VS SRH: అరెరే..చిలకమ్మా తప్పు చెప్పిందే !

Exit mobile version