ఐపీల్ 2024 ఉప్పల్ వేదికగా నిన్న రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడ్డాయి. మొదట టాస్ గెలిచినా ముంబై ఫీల్డింగ్ చేయగా హైదరాబాద్ బాటింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దూకుడు గా ఆడారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62రన్స్,9ఫోర్లు,3సిక్స్ ) చేయగా, వన్ డౌన్ గా వచ్చిన అభిషేక్ శర్మ కూడా (23బంతుల్లో 63రన్స్,3ఫోర్లు,7సిక్స్) హెడ్ తో కలిసి బౌలర్స్ పైన అటాక్ చేస్తూ సెకండ్ వికెట్ భాగస్వామ్యం 69రన్స్ చేసారు. తరువాత విల్లా ఇద్దరు ఔట్ అయినా తరువాత ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ ముంబై బౌలర్లు ని ఊచకోత కొసరు. క్లాసెన్ (34 బంతుల్లో 82రన్స్,4ఫోర్లు,7సిక్స్ ) చేయగా మార్క్రామ్ (28 బంతుల్లో 42రన్స్,2ఫోర్లు,1సిక్స్ ) తో హైయెస్ట్ టార్గెట్ ని ముంబై ముందు ఉంచారు.
Also Read; IPL 2024 MI VS SRH: ఉప్పల్ లో నమోదైన సరికొత్త రికార్డులివే..!
అయితే లక్ష చేదనలో బ్యాటింగ్ వచ్చిన ముంబై బ్యాటర్స్ ఓపెనర్స్ రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ నుంచి మంచి స్టార్ట్ లభించింది. నాలుగో ఓవర్ లో ఇషాన్ అవుట్ అవగా వెంటనే రోహిత్ కూడా వెనుదిరిగాడు. తరువాత వచ్చిన యంగ్ స్టార్స్ నమన్ ధీర్, తిలక్ వర్మ కూడా తామేమి తక్కువ కాదంటూ కౌంటర్ ఎటాక్ చేస్తూ టార్గెట్ చాలా దూరం ఉన్నా కానీ.. తమ సాయశక్తుల ప్రయత్నించారు. ఒకొనొక టైం లో ముంబై బేటర్లు హిట్టింగ్ చూసి హైదరాబాద్ ఫాన్స్ లో సందేహం మొదలయింది. కానీ డెత్ ఒవెర్స్ లో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం తో 31రన్స్ పరుగులు తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించారు. ముంబై బేటర్స్ లో తిలక్ వర్మ (34 బంతుల్లో 64రన్స్,2ఫోర్లు,6సిక్స్ ) హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.
Also Read; SRH vs MI: ఉత్కంఠ పోరులో తొలి విజయం సాధించిన సన్ రైజర్స్..
నిన్న మ్యాచ్ మొదలవడానికి ముందు ఒక జ్యోతిష్కుడు చిలక జాతకం చెప్పారు. మొదట జ్యోతిష్కుడు చిలకను ముంబై , హైదరాబాద్ తలపడుతున్నాయి ఏది విన్ అవుతుంది చెప్పు చిలకమ్మా అంటే చిలుక పెట్టెలోనుండి వచ్చి ముంబై పోస్టర్ ఉన్న కార్డు తీసింది. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఇవాళ ముంబై గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవడంతో ఆ చిలకమ్మా ను సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్.