తెలంగాణలో రేపు ఎస్ఎస్‌సీ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు విద్యాశాఖ అధికారులు… టెన్త్ ఫలితాల రేపు ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు.. దీంతో.. పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులను అందరినీ పాస్ చేసింది. అయితే, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇచ్చి గ్రేడింగ్ కేటాయించనున్నారు.. దీనికి సంబంధిన ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది.. రేపు మంత్రి సబతి ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులు కాగా.. మార్కులు, గ్రేడ్లు రేపు తెలియనున్నాయి.