పదో తరగతి పరీక్షలు ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాలను వెల్లడికి అనువైన విధానంపై నివేదిక ఇచ్చింది హైపవర్ కమిటీ. 2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపొందించిన ఫార్ములాను ప్రభుత్వం ఆమోదించింది.. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ…
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎలాగైనా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలనే పట్టుదలతో ఏపీ ఉన్నా.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌తో వెనక్కి తగ్గి.. పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన చేసింది.. ఇక, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు..? అని అంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. పరీక్షల ఫలితాలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు…
తెలంగాణలో రేపు ఎస్ఎస్‌సీ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు విద్యాశాఖ అధికారులు… టెన్త్ ఫలితాల రేపు ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు.. దీంతో.. పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులను అందరినీ పాస్ చేసింది. అయితే, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇచ్చి గ్రేడింగ్ కేటాయించనున్నారు.. దీనికి సంబంధిన ఏర్పాట్లను…