కేఆర్ఎంబీ అధికారులపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆగ్రహం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఆర్ఎంబీ అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేఖలు రాసి అధికారులను వేదిస్తోంది అని అన్నారు. కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు 1980లో శంకుస్థాపన చేశారు. అలాంటి ప్రాజెక్టు అనధికార ప్రాజెక్టు ఎలా అవుతుంది. ఏపీ రాసిన ప్రతీ లేఖ పై కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ తెలంగాణ వివరణ కోరడం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పూర్వపరాలు తెలుసుకోకుండా బోర్డులు తెలంగాణకు సమాధానాలు ఇవ్వాలని ఎలా అడుగుతారు. నీటి వివాదాలల్లో నెలకొన్న అంశాలపై ఇవాళ్టి సమావేశంలో తెలంగాణ తరుపున గట్టి వాదనలు వినిపిస్తాం. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం మీటింగ్ లో ప్రశ్నిస్తాం అని తెలిపారు.
ఇక కృష్ణా బెసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుండి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టు, దీనిపై కేఆర్ఎంబి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కృష్ణా జాలాల్లో తెలంగాణకు యాబై శాతం ఇవ్వాల్సిందే. తెలంగాణ జనాభా పెరుగుతుంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో పెద్ద పరిశ్రమలు స్థాపిస్తున్నారు. నీటి వాటా కచ్చితంగా పెంచాలి. టేలిమెట్రీల విషయంలో కేఆర్ఎంబి భాద్యత రాహిత్యంగా వ్యహరిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పదే పదే బోర్డులకు లేఖలు రాసి వేధిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబి ఏపీకి తరలించవచ్చు… కానీ వైజాగ్ తరలించడం కృష్ణా బేసిన్ దాటి గోదావరి బేసిన్ లో పెట్టడం అవుతుంది. ఇది సరికాదు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!