Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
- రూ.13,000 కోట్లతో భారీ రోడ్ల ప్రాజెక్టు
- 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల అభివృద్ధి
- రూ.338 కోట్లతో 14 కొత్త రోడ్లకు శంకుస్థాపన
- యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌ను “నా భూతో న భవిష్యత్” అన్న రీతిలో అత్యద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలతో తనకు ప్రత్యేకమైన, వెలకట్టలేని అనుబంధం ఉందని.. గతంలో ప్రజలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి తనను ఎంపీగా గెలిపించారని ఆయన కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శ్రీకారం చుట్టామని మంత్రి స్పష్టం చేశారు.
రూ. 13,000 కోట్లతో చారిత్రక రోడ్ల ప్రాజెక్టు
రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి వివరించారు. మొత్తం రూ. 13,000 కోట్ల భారీ వ్యయంతో, 34 ప్యాకేజీల కింద, 6,092 కిలోమీటర్ల మేర విస్తరించిన 441 రోడ్లను హ్యామ్ (HAM – Hybrid Annuity Model) విధానంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నల్లగొండ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకున్నామని ఆయన గుర్తుచేశారు. ప్రమాదాలు లేని క్వాలిటీ రోడ్లుగా వీటిని తీర్చిదిద్దుతామని, రోడ్లు రద్దీగా ఉండే హైదరాబాద్ రూరల్ సర్కిల్ 1 & 2 ప్యాకేజీల్లోనే దాదాపు 30 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
- CM Revanth Reddy: ఉద్యోగుల జీతాలపై రేవంత్ కీలక నిర్ణయం.. ఏజెన్సీలకు వార్నింగ్
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
- టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
రూ. 338 కోట్లతో 14 రోడ్లకు శంకుస్థాపన
అభివృద్ధి పనుల్లో భాగంగా తాజాగా రూ. 338 కోట్ల వ్యయంతో 149 కిలోమీటర్ల మేర విస్తరించే 14 రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో నాలుగు లేన్ల (4-Lane) రహదారుల నిర్మాణం ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, ఈ ప్రాంత ప్రజల మనిషిగా అద్దం లాంటి రహదారులను నిర్మించి తీరుతామని.. ఈ రోడ్ల కనెక్టివిటీ ద్వారా రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మంత్రి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!