Komatireddy Venakt Reddy : తెలంగాణలో మౌలిక వసతుల రంగంలో ఎన్నడూ లేని భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు మొత్తం రూ.60,799 కోట్లు మంజూరు కావడం తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద రికార్డని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారుల…
Komatireddy Venkat Reddy : రోడ్లు, భవనాలు శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేపు కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎర్రమంజిల్ R&B ప్రధాన కార్యాలయంలోని సమావేశంలో మంత్రి హ్యామ్ రోడ్లు, టిమ్స్ హాస్పిటల్స్ వంటి పలు ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు, గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిన కారణంగా, ప్రభుత్వం హ్యామ్ విధానంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రోడ్లు నిర్మించాలనే నిర్ణయం…
Nitin Gadkari: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం, బాగున్నారా..? అంటూ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టిన ఆయన అనేక అభివృద్ధి అంశాలపై స్పందించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సరిగా సాగడంలేదని గడ్కరీ పేర్కొన్నారు. ఈ పనుల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం కనుగొన్నామని, వేగంగా పూర్తి చేయడంకోసం కొత్త కాంట్రాక్టర్‌ను నియమించామని తెలిపారు. వచ్చే పది నెలల్లో ఫ్లై…
CM Revanth Reddy : రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో…
సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.
Damodara Raja Narasimha : గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రోడ్ల మరమ్మత్తులు లేక రాష్ట్రంలో రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్లతో వివిధ రోడ్డు పునర్నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో రోడ్లు మరమత్తు పనులు చేపట్టకపోవడం తో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. ప్రస్తుతం…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ…